తెలుగు సంగతులు

ఆదివారం, జనవరి 30, 2011

వసంతం

*వసంతాన్ని పెద్దాయన వెతికి బానే పట్టేశాడు. ఈ కాంక్రీటు అరణ్యం ఇలాగే పెరిగితే మన గతి ---  వసంతం రాను రాను పేవ్ మెంటు పగుళ్ళలో కూడా కనబడదేమో!

*జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, భారతమాజీ రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి మనుమడు అయిన శ్రీ పాలగుమ్మి సాయినాథ్ గారి అభిప్రాయం ప్రకారం -- "జర్నలిస్టులు రెండు రకాలు. ఒకటి జర్నలిస్ట్లులు రెండు స్టెనోగ్రాఫర్లు". కాని ఇప్పటి పరిస్థితుల్లో అతి ముఖ్యమయిన మరో రకాన్ని-- అదీ సంఖ్యాపరంగా మొదటి కోవలోకి తీసుకోవల్సిన వర్గాన్ని మరిచారో, కావాలనే విస్మరించారో-- వారే బ్లాక్ మెయిలర్లు.


* “I have been asked whether I have changed in these past twenty-five years.  No, I
am the same--only more so.  Have my ideas changed? No, my fundamental
convictions, my view of life and of man, have never changed, from as far back as
I can remember, but my knowledge of their applications has grown, in scope and
in precision”.  Ayn Rand in her foreword of ”Fountain Head” after 25 years in print.

చివరిగా  ఒక్క విన్నపం -- ప్రేమ గుణం పెరగాలంటే ముందు మనల్నిమనం  ప్రేమించు కోవాలి. 

* పరకడుపునే
పక్క దిగేముందు
అన్ని అవయవాల్ని
ముట్టుకుని, ముద్దెట్టుకో
కళ్ళు చూడలేని ..ఇంధ్రధనస్సు,
చెవులు వినలేని .. సప్త స్వరాలు
నోరు విప్పలేని .. నమక చమకాలు.
ఎందుకు?
అవయవాలే అష్ట ఐశ్వర్యాలు
నీ కాళ్ళని
నీ చేతుల్తో
నీ కళ్ళకి అద్దుకొని
ముద్దు పెట్టుకో-- నిన్నుభరిస్తున్నందుకు.--జనార్ధన మహర్షి .




సోమవారం, జనవరి 24, 2011

కరువు బరువు


రాజుగారి తలపాగానుండి రాణీ గారి పై బట్ట సర్దుబాటే కాదు --
మంత్రిగారి వాటం చూసినా తెలియటంలేదూ రాజ్యం ఎలా ఉందో!!
ఇలాంటివి --కాదు ఇంకా గమ్మత్తైనవి బోలెడన్ని కావాలంటే మన ప్రియతమ బాపూ గారి స్వాతి కార్టూన్లు పుస్తకం కొని చూడాల్సిందే -- ఋషి పుబ్లిషర్సు వారి ప్రచురణ. విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది. కార్టూన్ క్రింది వ్యాఖ్య మన సొంత పైత్యం. మీకు తెలుసుగా, బాపూగారి బొమ్మలే మాట్లాడుతాయి.
ఇక అవ్యవస్థల వైపు ఒక్కసారి తొంగి చూస్తే--కొంచెం ఆలస్యానికే పెనాల్టీలు, అదనపు రుసుములు, సేవల నిలిపివేత లాంటి చర్యలు-- తమ విలువైన, ప్రాణాధారమయిన ఖాతాదారులపై తీసుకునే టెలికాం కంపెనీలు, లైసెన్సులు పొంది సకాలంలో సేవలందించకపోవడం ఎలా క్షమార్హం? సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుంటే తప్ప ట్రాయ్ లాంటి సంస్థలు కూడా తమ కనీస విధుల్ని నిర్వహించే పరిస్థితి లేదంటే, ఇది ఖచ్చితంగా రాజకీయుల అతి ప్రమేయం, అధికార దుర్వినియోగం మాత్రమే! ఆలస్యానికి ఒప్పందం ప్రకారం విధించాల్సిన జరిమానాలు, తీసుకోవాల్సిన చర్యలు సక్రమంగా ఆయా సంస్థలు తీసుకుంటే, మౌలిక సదుపాయాల కల్పనలో, సేవలు అందించడంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని చాలా మట్టుకు నివారించవచ్చు.అయితే రాజకీయుల అనవసర జోక్యాన్ని ముందుగా అరికట్టవలసి ఉంది. అత్యున్నత స్థాయిలో అవినీతికి ఇదే కేంద్ర బిందువు అన్న విషయాన్ని విస్మరించకూడదు. మొత్తంగా వ్యవస్థలో రాజకీయ నాయకులు, అధికారులు, గుత్తేదార్లు కలిసి ఏర్పరచిన విషవలయాన్ని చేధించకపోతే, ట్రాయ్, ఆంధ్రప్రదేశ్ లోని ఎ పి ఐ ఐ సి లాగే అన్ని సంస్థలు నిష్క్రియాపరత్వంతోటి, లాలూచీతనంతోటి భ్రష్టు పట్టిపోతాయి. కామన్ వెల్త్ గేమ్స్, ఆంధ్రప్రదేశ్ లోని జలయజ్ఞం,2జి స్పెక్ట్రం... ఏ పేరైతేనేమి, ఎంత కుంభకోణమయితేనేమి ఇలాగే దర్జాగా సాగి సాగిపోయే ప్రమాదంనుండి మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వాలు గుత్తేదార్ల చేతిలో ఉండే స్థాయి నుండి, గుత్తేదార్లే ప్రభుత్వాల్ని నడిపే స్థాయికి ప్రమాదం ముంచుకొస్తోంది. తస్మాత్ జాగ్రత్త!

మరో మంచి పుస్తకం గురించి చిన్న విషయం....

పుట్టిన గడ్దనే నమ్ముకొని, అడవి తల్లి ఒడిలోనే పెరిగి, పొద్దంతా ఆనందంగా ప్రకృతి పంచనే కాయకష్టం చేసుకుబ్రతుకుతున్న అడవిబిడ్డల్ని వారి భూమినుంచి, జీవనవిధానంనుంచి బ్రతుకునుండి వేరుచేసి, అభివృధ్ధి పేరు చెప్పి వెళ్ళగొడితే సహించక తిరగబడ్డ ఒక ఆడపిల్ల నిజజీవితగాధ "అడవి తల్లి". సి.కె.జాను అనే ఆడబిడ్డ స్వయంగా అనుభవించిన దైన్య జీవితంలోనుండి, నిర్దాక్షిణ్యంగా భూమినుండి విడదీసిన పరిణామాలకు విలవిల్లాడిపోయిన గిరిజనుల గుండె చప్పుళ్ళనుండి పుట్టిన తిరుగుబాటే సి.కె.జాను. ఆ తిరుగుబాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాన్ని ఒక్క కుదుపు కుదిపింది. దిగివచ్చిన ప్రభుత్వం ఆమె నాయకత్వంలోని ఆదివాసీలతొ ఒడంబడిక చేసుకుంది. షరా మామూలుగానె ఆచరణలో పెట్టలేదు. దానికి సి.కె.జాను మరింత పట్టుదలతో తిరిగి పోరాటాన్ని కొనసాగిస్తూ-- "ఆదివాసీల సమస్యల్ని ఆదీవాసీలే పరిష్కరించుకోవాలని, భూమిని నమ్ముకొన్న అడవి బిడ్డ్డలకు ఆ శ్రమ విలువ తెలియని వేరే మేధావులెవ్వరూ పరిష్కారం చూపించరని సిధ్ధాంతీకరించిన ఆమె నిరక్షరాసురాలు. ఆమె స్వయంగా చెప్పగా భాస్కరన్ అనె జర్నలిస్టు వ్రాసిన అసంపూర్తి ఆత్మ కధే "అడవి తల్లి".

గురువారం, జనవరి 20, 2011

వెండి మబ్బు

వెండి మబ్బు ... కాస్తంత బంగారం పూత పూసి.
హైదరాబాదు శివారులో గత వానాకాలం ఒక సాయంత్రం పూట..

సోమవారం, జనవరి 17, 2011

పుస్తకాలు కొనడవా?

“అడిగితే గాని అమ్మయినా పెట్టదు”. ఈ పాత సామెతను మార్చాల్సిన రోజులొచ్చాయనిపిస్తోంది. పిల్లలు అడక్కపోయినా బలవంతంగా కూరుతున్నారు తల్లులు. అయినా పాత సామెతకు సరిపోయే ఒకే అమ్మ ఉంది మన దేశం లో – సోనియమ్మ. ఈవిడది ఒక మెట్టు పై మాటే! అడిగినా పెట్టదు. తెలంగాణా కోసం ఎంతమంది అరిచి గీ పెట్టినా ఒక్కసారీ నోరు విప్పని అమ్మ ఈ జగన్మాత. ఈవిడ ఎలా అమ్మ ? ఎవరికి అమ్మ? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే హక్కు ఆవిడకు రాజ్యంగబద్ధంగా ఉందా ? రాష్ట్రశాసన సభ ఉంది.. లోక సభ ఉంది.. కేంద్ర మంత్రివర్గం ఉంది..ప్రధానమంత్రి ఉన్నారు. అవన్నీ మానేసి ఒక పార్టీ లేదా పార్టీల కలగూరగంపకి నాయకురాలు ఇవ్వదగిన విషయమా ప్రత్యేకరాష్ట్రం? అవునులెండి! అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాలన్నా, ప్రారంభోత్సవం చేయాలన్నా ఆవిడే దిక్కు గా భావించే దిక్కుమాలిన పార్టీ శ్రేణులు---, ఏమాత్రం అడ్డగించని బిజెపి,తెరాస,తెదేపా, కమ్యూనిస్టులు వగైరా పనికిమాలిన ప్రతిపక్షాలు – అమ్మని సూపర్ పవర్ చేసేసి రాజ్యాంగం ఉనికికే ప్రమాదం తెచ్చే దౌర్భాగ్యం పట్టించేసారీ రాష్ట్రానికి. ప్రత్యేక రాష్ట్రం లాంటి ఏ డిమాండునయినా, ప్రజాభీష్టం మేరకు, రాజ్యంగాబద్ధంగా సాధించుకోవాలి గాని... ఇలా దేబిరించి రాజ్యాంగాన్ని పరిహసించే విధంగా మాత్రం కాదు.

నచ్చిన పుస్తకం

“మీకు నచ్చిన పుస్తకం” అన్న అంశం పై జరిగిన ఒక గోష్ఠిలో వక్తలంత వారికీ నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడారు. ఆఖరుగా మాట్లాడాల్సిన వక్తను సమయాభావంవల్ల క్లుప్తంగా మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. దానితో మండిన ఆయన నిరసనగా ‘నాకు బాగా నచ్చిన పుస్తకం, బాలన్సు బాగా ఉన్నప్పుడు నా బాంక్ పాస్ పుస్తకం’ అని ఒకే ఒక వాక్యంతో ఉపన్యాసాన్ని ముగించాడు.

పుస్తకాలు కొనడవా? బార్బేరియస్!

"మన దేశంలొ ఇండస్ట్రీస్ పెరగలేదంటే, ప్రాజెక్టులు రాలేదంటే, అందుక్కారణవేవిటీ? ఇదే. అక్షరాల ఇదే. ఈ పుస్తకాలు కొనడవనే జబ్బే! ప్రతివాడూ పుస్తకాలు కొండవే? ఊరికోడు కొంటే చాలదూ? అదే నలుగురం ఎరువడిగి తెచ్చుకుంటాం. లేదా దొంగిలిస్తాం. క్రైంస్ అనగా నేరాలు. నెలకి రెండు వర్షాల్లాగా జరుగుతాయి. నాలుగు డబ్బులు తిరుగుతాయి. కోర్టులు వర్ధిల్లుతాయి. సివిలైజేషను ముందుకి నడుస్తుంది. ప్రతివాడూ పుస్తకాలు కొనేస్తే ఇదంతా స్థంభించిపోదూ? కోర్టులు, బందిఖానాలు, సిగార్సు వగైరా వర్తక వ్యాపారాలు అన్నీ ఆగిపోతాయి. ఆ తరువాత పుస్తకాలు వ్రాసుకుందుకు మటుకు మెటీరియలు ఏవి దొరుకుతుందీ? నేరాలు జరక్కపోతే వేటి గురించి వ్రాస్తాం? హత్యా సాహిత్యం హతం ఖతం అయిపోదూ? అన్యాయం హరించిపొతే ఏది నశించాలని రాస్తాం? అసలే ఆంధ్రాలో ప్రతి మూడోవాడూ కవి. అడ్డమైనవాడూ రాసేస్తున్నాడోయ్ అని అడ్డమైనవాడూ ఏడ్చి నెత్తి మొత్తుకుంటున్నాడు. మర్నీలాంటివాళ్ళు కూడా బుక్కులికి వందలూ వేలూ గుమ్మరించి కొనేస్తే బుక్కిండిస్ట్రీ పెరిగిపోతుంది. రైటర్లు రోజూ తిండి తిండం మరిగి, బలిసి, రాయడం మానేస్తారు. ఆ పైన ఇది లాభసాటిరోయ్ భగవాన్లూ అని ప్రతి రెండోవాడూ కూడా రాయడం మొదలెట్టేస్తాడు. ఇహనందరూ రైటర్లే, అప్పుడు ప్రతివాడికీ తన పుస్తకాలు చదువుకుందికిమటుకు తీరుబాటుంటుంది. మరొహడి చెత్త చదవనపుడు డబ్బు పోసి కొండవెందుకులె అని ఎలాగూ కొనడు. ...అందువల్ల ఫండ్స్ ని అక్రమంగా దుర్వినియోగం చేసి పుస్తకాలు ..." ముళ్ళపూడి వారి గిరీశం లెక్చర్లు నుంచి ఓ మచ్చు తునక.

మరి ఈ పుస్తకం కొనాలనిపిస్తోందా? అయినా కొని చదవొద్దు. కొంటే వొచ్చే అనర్థం అర్థమయ్యింది కదా! నా దగ్గర, మన మిత్రుల దగ్గర ఇలాంటివి కోకొల్లలు. అరువడిగి తెచ్చుకుందాం. బుథ్ధిగా, పథ్ధతిగా తిరిగి ఇచ్చేసుకునే (ఇల్లు కదలకుండా) ఏర్పాటు చేసుకుందాం. మరి మీకిష్టవయితే మన బ్లాగు gksraja.blogspot.com చూడండి. అందులో కుడి వైపు పైన ఉన్న FOLLOW బటన్ నొక్కి మీ email ID ఎంటర్ చెయ్యండి. మీ ఉద్దెశాల్నీ, సూచనల్నీ నా మెయిలు gksraja@yahoo.com కి వ్రాయండి. తొందర్లోనే మన నెట్ వర్క్ ఒకటి తయారు చేసుకుందాం. ఏవంటారు?

ఒకవేళ కొనాలనే భయంకరమైన నిర్ణయం తీసుకుంటే మంచిదే! పది కాలాలపాటు మనతో ఉండవలసిన ఇలాంటి పుస్తకాలు జాగ్రత్త చేసుకొని మనసు బాలేనప్పుడూ, బాగా ఉత్సాహంగా ఉన్నప్పుడూ మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు. ముళ్ళపూడి వారి రచనలన్నీ నేను కొన్నంతవరకూ 8 సంకలనాలుగా వచ్చాయి. ఒక్కోటి రూ.150/- విశాలాంధ్రావారు బహు చక్కగా ముద్రించి సభ్యత్వం తీసుకున్నవారికి తగిన డిస్కౌంట్ తో అమ్ముతున్నారు.

శనివారం, జనవరి 08, 2011

మనమందరం

"నీకోసం నువ్వు బతుకు... ఎవర్నీ నీకోసం బతకమని అడక్కు" -- అయాన్ ర్యాండ్.
"మనమందరం సామాజికంగా, మతపరంగా కొన్ని కొన్ని నిర్దేశించిన భావోద్వేగాలకు లోనయ్యేట్టుగా ప్రోగ్రాం అయి ఉన్నాం. ఇదే గొప్పది అనుకోవడం, దానికి విశ్వాసంగా ఉండడం, కట్టుబడి ఉండడం, కనీసం అవి ఎందుకు అలా చెబుతున్నాయో కూడా మనకు మనం ప్రశ్నించుకోకుండా వాటిని గుడ్డిగా అనుసరిస్తాం."---- రాంగోపాల్ వర్మ.

మిత్రులకు వందనాలు! ఈ మధ్య సంచలనం (అనుకుంటున్నారు మరి) సృష్టించిన రాంగోపాల్ వర్మ పుస్తకం "నా ఇష్టం" బాగానే ఎక్కువ ముక్కు సూటిగా, కొంచెం తార్కికంగా, కాస్తంత ఆలోచింపచేసేదిగా, అక్కడక్కడా అసందర్భంగా, ఎక్కడెక్కడో తిక్క తిక్కగా ఉంది. చాలావిషయాలు ఉత్కంఠ రేపేవిగా ఉన్నాయి. కొనదగినదే గాని కొంచెం ధర ఎక్కువే! రూ.175/-. అసలు విషయం. ఈ పుస్తకం ఆయనకే అంకితం. ఎందుకని అడక్కండి, అది ఆయనిష్టం-- అడగడానికి మనమెవళ్ళం- కొనడంవరకే!!! ఎమెస్కో పబ్లిషింగ్!